బాధితులు ఎప్పటికీ భాధితులుగానే మిగిలిపోతున్నారు

విధాత‌:యువతి అత్యాచారంపైమాజీ మంత్రి పీతల సుజాత కామెంట్స్.కృష్ణానదిలో యువతిపై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరం - ఇటువంటి ఘటనలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ చర్యలు కంటి తుడుపుగా మాత్రమే ఉన్నాయి…ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం తప్ప నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు..బాధితులు న్యాయం జరగక ఎప్పటికీ భాధితులుగానే మిగిలిపోతున్నారు. దిశ యాప్ లు, దిశ పోలీస్ స్టేషన్ లు, చట్టాలు కేవలం ప్రచారం కోసమే అన్నట్లు కనిపిస్తున్నాయి సీతానగరం […]

  • Publish Date - June 21, 2021 / 09:48 AM IST

విధాత‌:యువతి అత్యాచారంపైమాజీ మంత్రి పీతల సుజాత కామెంట్స్.
కృష్ణానదిలో యువతిపై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరం – ఇటువంటి ఘటనలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ చర్యలు కంటి తుడుపుగా మాత్రమే ఉన్నాయి…ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం తప్ప నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు..బాధితులు న్యాయం జరగక ఎప్పటికీ భాధితులుగానే మిగిలిపోతున్నారు.

దిశ యాప్ లు, దిశ పోలీస్ స్టేషన్ లు, చట్టాలు కేవలం ప్రచారం కోసమే అన్నట్లు కనిపిస్తున్నాయి సీతానగరం పుష్కర ఘాట్ పరిసరాలలో నిత్యం జన సంచారం ఉంటుంది… అలాంటి చోట ఒక యువతికి రక్షణ కరువైంది అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అత్యాచారంకి గురైన బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి… నిందితులను కఠినంగా శిక్షించాలి.దిశ చట్టాలు, పోలీస్ స్టేషన్ లు, యాప్ లు తెచ్చిన ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసిన కేసుని వేగవంతం చేయాలి.యువకుణ్ణి తాళ్లతో కట్టేసి,యువతిని ఇసుకలో కిరాతకంగా కుక్కేసి అత్యాచారం చేశారంటే నిందితులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోవచ్చు.యువతిపై జరిగిన అత్యాచారంపై డీజీపీ గారు విచారం వ్యక్తం చేయడం కాదు…నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.

సీఎం జగన్ మహిళలకు తమ ప్రభుత్వంలో భద్రత ఉందని గొప్పగా చెప్తున్నారు… మహిళల భద్రతలో డొల్లతనం రాజధాని పరిసరాల్లోనే బయట పడింది.సీఎం వెంటనే స్పందించి యువతికి న్యాయం చేయాలి…జగన్ పాలన అసమర్థ ప్రభుత్వం పాలన అని ఇప్పటికే ప్రజలుమాట్లాడుకుంటున్నారు…అయినా జగన్ ప్రభుత్వంకు చలనం లేదురాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి, ఇద్దరు మహిళా మంత్రులు,ఒక మహిళా కమీషన్ చైర్మన్ ఉన్నా మహిళలకు, యువతులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు కానీ, ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తే మాత్రం తప్పుడు కేసులు పెడుతున్నారు… అరెస్టులు చేస్తున్నారు… ప్రతిపక్షాల అరెస్టులపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదు.రాష్ట్రంలో జగన్ పాలన చేస్తున్నారో నిద్ర నటిస్తున్నారో అర్థం కావడం లేదు… ఇప్పటికైనా జగన్ మత్తు నిద్ర వీడాలి… మహిళల రక్షణపై దృష్టి పెట్టాలి.

Readmore:యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం,బాధాకరం – ఎపి డి‌జి‌పి