విధాత : జీఓ 217ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మత్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి జగన్ జీఓ 217 పేరుతో మత్యకారుల గొంతు కొస్తున్నారు. టీడీపీ హయాంలో మత్యకారులకు సబ్సిడీ ఇచ్చిన వేట పరికరాలను నిలిపివేశారు. మత్యకార భరోసా కూడా సక్రమంగా అందరికి అందడం లేదు. నేడు మత్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. 217 జీవో కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే ఇచ్చామని మంత్రి అప్పలరాజు చెబుతున్నారు. జీవోలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అని ఉంది. మంత్రి చెబుతున్న అసత్యాల వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. మత్యకారులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం జీవో విడుదల చేస్తే వైసీపీలోని మత్యకార నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం’’ అని పేర్కొన్నారు.
మంత్రి చెబుతున్న అసత్యాల వెనుక కుట్ర ఉంది
<p>విధాత : జీఓ 217ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మత్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి జగన్ జీఓ 217 పేరుతో మత్యకారుల గొంతు కొస్తున్నారు. టీడీపీ హయాంలో మత్యకారులకు సబ్సిడీ ఇచ్చిన వేట పరికరాలను నిలిపివేశారు. […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి