Site icon vidhaatha

జివో217ను ర‌ద్దు చేయ‌క‌పోతే మెడలు వంచడం కాదు నడ్డి విరుస్తాం

విధాత‌: మంత్రి అప్పలరాజు,ఎంపి మోపిదేవిలను మత్స్యకారులం ద్రోహులుగా ప్రకటిస్తున్నాం.బిజెపి, జనసేన, కులసంఘాలుతో ఉద్యమం చేస్తాం.బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు సోమువీర్రాజు తొమ్మిది ప్రశ్నలు వేస్తే మంత్రి అప్పలరాజు సమాధానాలు చెప్పకుండా అబద్ధాలు మాట్లాడారు.అత‌నికి మంత్రి క్షమాపణ లు చెప్పాలి.మా జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తోంది ప్రభుత్వం,తరతరాలుగా మేం చేపలవేట కు వెళుతున్నాం.వంశపారంపర్యంగా వస్తున్న చేపలవేట కు వెళ్ళకుండా ఆపేహక్కు నీకెవడిచ్చాడు,మద్య లో వచ్చావు అర్థాంతరంగా జీవో లు తేవద్దు.

వలవిసరడం మాత్రమే వచ్చు రాజకీయ వలలు విసరడం రాదు.ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జీవో లు ఇవ్వాలి అంతెకాని మానోటికాడ కూడు చెడగొట్టేందుకు కాదు.217జీవో కేవలం మాకు నిలవ నీడ లేకుండా చేయడానికి,మా బ్రతుకు లను చిదిమేసే దుష్టపన్నాగం ఈజీవో అర్థంగా కనపడుతోంది.మా బ్రతుకు బుగ్గి చేసే జివో217 రద్దు చేసేవరుకూ జగన్ తో పోరాడతాం,తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.జీవో రద్దు చేయకపోతే మెడలు వంచడం కాదు నడ్డి విరుస్తాం సిద్ధంగా ఉండండి అంటూ వ్య‌ఖ్యానించారు ఫిషర్ మెన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బొమ్మిడి గణేష్.

Exit mobile version