విధాత:మంత్రి అప్పలరాజు అనుచరులు పశువుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.గౌతు శిరీషపై దుష్ప్రచారం ఆపకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.తనపై సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు, వీడియోలు పెట్టి వేధిస్తున్నారని రాష్ట్ర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వాపోయారు.మంత్రి అప్పలరాజుపై ఎస్పీకి శిరీష ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియాలో సర్దార్ కుటుంబంపై మంత్రి అప్పలరాజు అనుచరులు.. ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు.తనను మానసికంగా ఇబ్బంది పెట్టి పశువులతో అడ్డగోలు రాతలు రాయిస్తున్నారని శిరిష వాపోయారు.