తెగిన ఫించా ప్రాజెక్టు రింగ్ బండ్

సుండుపల్లె : భారీ వర్షాల వలన ఫించా ప్రాజెక్టు కు వరద నీరు ముంచెత్తుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటి ఉదృతికి ఫించా ప్రాజెక్టు కు నిర్మించిన రింగు బండ్ (మట్టి కట్ట)కోతకు గురై తెగిపోయింది. గత కొద్దినెలల కింద భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో రింగ్ బండ్ నిర్మించారు. ప్రస్తుత తుఫాను వరదల కారణంగా ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తినా వరద నీటి ప్రవాహం ఎక్కువై మట్టి కట్ట తెగిపోయింది. దీంతో […]

  • Publish Date - November 19, 2021 / 12:38 AM IST

సుండుపల్లె : భారీ వర్షాల వలన ఫించా ప్రాజెక్టు కు వరద నీరు ముంచెత్తుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటి ఉదృతికి ఫించా ప్రాజెక్టు కు నిర్మించిన రింగు బండ్ (మట్టి కట్ట)కోతకు గురై తెగిపోయింది.

గత కొద్దినెలల కింద భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో రింగ్ బండ్ నిర్మించారు. ప్రస్తుత తుఫాను వరదల కారణంగా ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తినా వరద నీటి ప్రవాహం ఎక్కువై మట్టి కట్ట తెగిపోయింది. దీంతో ప్రాజెక్టు కు దిగువ ప్రాంతంలోని వివిధ పల్లెల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.