విధాత: ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో ఎన్జీవో కాలనీలో కాపురం ఉంటున్న టీచర్ శంకర్ రెడ్డి, పక్కనే కాపురం ఉంటున్న టీ స్టాల్ రమణ ఇంట్లో దొంగలు చొరబడ్డారు.
ఆ సమయానికి శంకర్ రెడ్డి వాకింగ్ వెళ్లడంతో భార్య ఉషారాణి గట్టిగా అరుస్తుందన్న అనుమానంతో ఆమె తలపై బలంగా కట్టితో కొట్టడంతో ఆమె మృతి చెందింది.
ఆ పక్కింట్లో కాపురం ఉంటున్న రమణ సైతం టీ స్టాల్ నిర్వహించేందుకు వెళ్లడంతో అతని భార్య శివమ్మను సైతం ఇలాగే కొట్టడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.