విధాత:ప్రముఖ కథా రచయిత కాశీపట్నం రామారావు మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కారా మాస్టారు గా ప్రసిద్ధి పొందిన ఆయన కథానిలయం సంస్థ ద్వారా తెలుగు కథకు ఉన్నతిని కల్పించారని అన్నారు.
సరళమైన రచనా శైలితో సామాన్య పాఠకుల గుండెలకు సైతం హత్తుకునేలా సాగిన కారా మాస్టారు రచనా పరంపర, భావ ప్రాధాన్యతతో ముందుకు సాగేదని అన్నారు. వారి కథలు తెలుగు సాహిత్యానికి వన్నెలు అద్ది జాతీయ స్థాయి గౌరవాన్ని అందించాయని…… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.