విధాత:కడపజిల్లాలోని వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నానదిలో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో అన్నా చెల్లెళ్లు ఉన్నారు. అబ్దుల్ రషీద్, జవేరియా, అనుస్ ఖాన్‌ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వాహిద్‌ఖాన్ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కడప నగరం బెల్లంమండి వీధి, పుల్లంపేటకు చెందినవారు కావడంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి.