విధాత: ఏలూరు పార్లమెంటు లోని టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని ఏలూరు ప్రజా ధర్నాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ఏలూరు పరిధిలో మత్స్య పరిశ్రమ, ఉద్యాన పంటల ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని,పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో సత్యసాయి స్కీం మంచినీటి పథకం పున ప్రారంభించాలి.200 లకు పైగా గ్రామాల్లో త్రాగునీరు లేకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోందన్నారు.
ఏలూరులో వింతవ్యాధి ఘటనపై ఇప్పటివరకూ ప్రభుత్వం నిజాలు వెల్లడించలేదు,డ్రైనేజీ, త్రాగునీటి సమస్యపై అపోహలు ఉంటే నివేదికలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.