విధాత : తిరుమలలో బ్రహ్మాండనాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహా రథంపై శ్రీవారు భక్తులకు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
రాత్రి శ్రీవారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. శ్రీనివాసుడు కల్కీ అవతారంలో అశ్వవాహన రూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30నుంచి 10గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.