ట్యాంక్‌ బండ్‌ను కార్పొరేషన్‌కు బదిలీ చేయండి

<p>విధాత‌: నగరంలోని కలెక్టరేట్‌ వద్ద నుంచి ముసలమ్మ కట్ట వరకు ఉన్న ట్యాంక్‌ బండ్‌ రోడ్డు ప్రాంతాన్ని జలవనరుల శాఖ నుంచి నగర పాలక సంస్థకు బదిలీ చేయాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి రోడ్డుకు అనుసంధానమయ్యే ఈ రోడ్డు గతుకులమయంగా మారడంతో వాహనరాకపోకలకు ఇబ్బందిగా మారిందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పైగా వ్యర్థపదార్థాలను కూడా చెరువు కట్టపైనే పారవేస్తుండడంతో […]</p>

విధాత‌: నగరంలోని కలెక్టరేట్‌ వద్ద నుంచి ముసలమ్మ కట్ట వరకు ఉన్న ట్యాంక్‌ బండ్‌ రోడ్డు ప్రాంతాన్ని జలవనరుల శాఖ నుంచి నగర పాలక సంస్థకు బదిలీ చేయాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి రోడ్డుకు అనుసంధానమయ్యే ఈ రోడ్డు గతుకులమయంగా మారడంతో వాహనరాకపోకలకు ఇబ్బందిగా మారిందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పైగా వ్యర్థపదార్థాలను కూడా చెరువు కట్టపైనే పారవేస్తుండడంతో అసౌకర్యంగా ఉందన్నారు. కొందరు చెరువు కట్ట ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌ బండ్‌ను కార్పొరేషన్‌కు బదిలీ చేస్తే రోడ్డు అభివృద్ధితో పాటు సుందరీకరణ చేసే అవకాశం ఉంటుందన్నారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఉండడమే కాకుండా ట్రాఫిక్‌ సమస్య కూడా తొలగిపోతుందని తెలిపారు. తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మిని కోరారు.

Latest News