విధాత:రాష్ట్ర సమాచార కమీషన్ కమిషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి,కాకర్ల చెన్నారెడ్డి లచే ప్రమాణం చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్.
ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ఇద్దరు ఆర్టీఐ కమీషనర్లతో సిఎస్ ప్రమాణం (Administered Oath) చేయించారు.
ఈకార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్,రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.రమేశ్ కుమార్, ఇన్ఫర్మేషన్ కమీషనర్లు బివి రమణ కుమార్,కట్టా జనార్దనరావు,ఆర్.శ్రీనివాసరావు,ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.