Site icon vidhaatha

వినాయక చవితికి బ్యాంకు ఉద్యోగులకు సెలవు

విధాత,అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్యాంకు ఉద్యోగులకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల తరహాలో ఏపీలో కూడా ఈనెల 10న సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూఎఫ్‌బీయూ లేఖ రాసింది. వారి అభ్యర్ధనను పరిశీలించిన ప్రభుత్వం.. ఎన్‌ఐ ఆక్ట్ ప్రకారం వినాయక చవితికి సెలవును ప్రకటించింది. ప్రభుత్వ సానుకూల స్పందనతో బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version