Vaibhav Suryavanshi| వైభవ్ సూర్యవంశీ..పదో తరగతి పరీక్షలకు..!

క్రికెట్ ప్రపంచంలో ఒక్కో పరీక్షను సునాయంగా నెగ్గుకొస్తు..రికార్డులను తిరగరాస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్నాడు. 14ఏళ్ల ఈ కుర్రాడు ఈ నెల 17వ తేదీ నుంచి బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు.

విధాత : క్రికెట్ ప్రపంచంలో ఒక్కో పరీక్షను సునాయంగా నెగ్గుకొస్తున్న భారత యువ సంచలనం(Indian young sensation ) వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు(Class 10 Exams) సన్నద్దం అవుతున్నాడు.  14ఏళ్ల ఈ కుర్రాడు ఈ నెల 17వ తేదీ నుంచి బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు.

ప్రిన్సిపల్‌ నీల్‌ కిశోర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను సూర్యవంశీ తమ స్కూల్లోనే రాయనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వైభవ్‌ సెలబ్రెటి క్రికెటర్‌ అయినందున..అతను పరీక్షలకు హాజరయ్యే క్రమంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇతర విద్యార్థులకు పరీక్షలు రాయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఐపీఎల్ క్రికెట్ తో అంతర్జాతీయ పొట్టి క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరుపున 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం రేపాడు. దేశవాళీ టోర్నీలలో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల అండర్‌-19 ప్రపంచకప్‌లో కూడా అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి.. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15ఏళ్లు కూడా లేకపోవడంతో వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీకి కొంత జాప్యం జరుగుతుంది. త్వరలోనే వైభవ్ టీమిండియా జెర్సీలో కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.

Latest News