టెన్షన్ సీన్…చావు అంచులను తాకిన మృత్యుంజయులు

బీహార్‌లో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు దూసుకురావడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టెన్షన్ సీన్…చావు అంచులను తాకిన మృత్యుంజయులు

రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న సమయంలో రైలు దూసుకరావడంతో ఓ తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన ఇద్దరు పిల్లలను కాపాడిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనలో వారితో పాటు మరో ఇద్దరు మహిళల ప్రాణాలు కూడా రక్షించబడ్డారు. ఈ వీడియో చూస్తున్న వారికి రోమాలు నిక్కబోడుచుకునే ఉత్కంఠ లోనవ్వగా..ఆ తల్లి సాహసాన్ని, త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌లోని షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్‌కు సంబంధించినది. అక్కడ ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే పట్టాలను దాటుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఒక రైలు వేగంగా దూసుకొచ్చింది. దాంతో ఆ మహిళలు వెంటనే ఫ్లాట్ ఫామ్ కు ఆనుకుని కింద కూర్చుని, పిల్లలను తమ శరీరాల కిందకు ఒత్తుకుని అదిమిపట్టుకున్నారు. ఆ రైలు వారి మీదుగా వెళ్ళిపోయినప్పుడు ఆ మహిళకు గాయాలు కూడా అయ్యాయి.

వారిని గమనించిన ప్రయాణికులు ఫ్లాట్ ఫామ్ పై నుంచే.. రైలు వారి శరీరాలను తాకినప్పుడు దాని కిందకు వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నారు. ఈ వీడియో చూసిన వారికి ఆ రైతు మృత్యుశకటంగా కనిపిస్తూ..వారి ప్రాణాలతో ఉంటారో లేదోనన్న ఉత్కంఠతను కల్గించింది. అయితే ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలతో బయటపడటం మహిళల ధైర్య సాహసాలు..త్యాగ గుణంతో పాటు భూమి మీద వారికి ఇంకా నూకలు ఉండటమేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య