విధాత, హైదరాబాద్ : బంగారం ధరలు మరోసారి పెరిగాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,970 పెరిగి.. రూ.1,57,750వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800పెరిగి.. రూ. 1,44,600వద్ద నిలిచింది. ఈ నెల 18నుంచి శుభకార్యాలు ఆరంభం కానుండటంతో బంగారం కొనుగోలు క్రమంగా జోరందుకుంటున్నాయి.
స్థిరంగా వెండి ధరలు
కిలో వెండి ధరలు శనివారం ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర క్రితం రోజు ధర రూ.2,80,000వద్ద కొనసాగుతుంది. కొనుగోళ్లు ఊపందుకోనున్న నేపథ్యంతో పాటు అంతర్జాతీయంగా ఆర్థికంగా, రాజకీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో పెరుగుదలను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
