Site icon vidhaatha

వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.. ఆదిమూలపుసురేష్

విధాత: వారం రోజులు ముందుగానే ఇంటర్ ఫలితాలను,మార్క్ లను విడుదల చేసాం.5లక్షల19వేల797మంది విద్యార్థులు ఇంటర్ పాస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేసాం.ఇతర రాష్ట్రాల్లో మార్క్ లు ఇస్తున్న నేపథ్యంలో మార్క్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. హై పవర్ కమిటీ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు పై నివేదికను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం.విద్యార్థులు ఫలితాలు పట్ల ఆసక్తి కనబరచకపోతే మరోసారి బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 26 నుంచి ఇంటర్ బోర్డ్ వెబ్ సౌత్ లో ఫలితాలు ఉంటాయి.

Exit mobile version