విధాత : వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియపై అధ్యయనం చేస్తున్న జాయిట్ పార్లమెంటరీ కమిటీ(JPC) గడువును పొడిగిస్తూ లోక్ సభ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి లోక్‌సభలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లుపై నివేదికను సమర్పించేందుకు 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2024లను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున కమిటీకి మరికొంత సమయం కావాలని చైర్మన్ పీపీ చౌదరి కోరారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా ఇప్పటికే మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ వంటి ప్రముఖులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఒకే ఓటర్ల జాబితా ఉంటుందని, దీనివల్ల దేశ సంపద, సమయం ఆదా అవుతాయని కమిటీ అభిప్రాయపడుతున్నది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహణకు కేంద్రం పట్టుదలతో వ్యవహరిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Kalvakuntla Kavitha| కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్
Ustaad Bhagat Singh | ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్.. పవన్ కల్యాణ్ మాస్ షోకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్
