Ustaad Bhagat Singh | ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్.. పవన్ కల్యాణ్ మాస్ షోకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 19, 2026 8:39 AM IST
Ustaad Bhagat Singh | ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్.. పవన్ కల్యాణ్ మాస్ షోకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉగాది కానుకగా గురువారం (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, కోలీవుడ్ స్టార్ నటుడు-దర్శకుడు పార్తీబన్ విలన్ పాత్రలో కనిపించారు.

సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలకు సంగీతం అందించగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పంద‌న‌లు..

ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామునే భారీ స్పందన లభించింది. ఏపీలో ఉదయం 4 గంటల నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి. మరోవైపు తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి షోలు మొదలయ్యాయి. మొదటి షోలు ముగిసిన వెంటనే అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

సినిమా చూసిన ఒక నెటిజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “పవన్ సినిమా సూపర్. అస్సలు ఊహించని విధంగా ఉంది. హరీష్ శంకర్ పవన్ కల్యాణ్‌ను చూపించిన విధానం అద్భుతం. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది” అంటూ ట్వీట్ చేశారు.

అదిరిపోయింది…

మరో నెటిజన్ కూడా సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తూ, “ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్‌బస్టర్ మూవీ. పవర్ స్టార్ టాప్ క్లాస్ మోడ్‌లో ఉన్నాడు. సినిమా మొత్తం ఒక రేంజ్‌లో సాగింది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పీక్స్‌లో ఉంది. మాస్ డైలాగులు, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కెవ్వు కేక” అంటూ కామెంట్ చేశారు.

ఇక మరికొందరు అభిమానులు పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా హరీష్ శంకర్ మాస్ టేకింగ్, పవన్ కల్యాణ్ మ్యానరిజమ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

మొత్తంగా మొదటి షోల తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ ప్రకారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఉగాది సెలవులు, పవన్ కల్యాణ్ మాస్ క్రేజ్ కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.