భారత ఇంజనీర్లు మరో అద్భుతాన్ని చేసి చూపించారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన ఇన్నోవేటర్ రవి తామ్టా తన స్టార్టప్ హపిడా స్కై రూపొందించిన HAPIDA SKYNeX ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ వెహికల్‌ను విజయవంతంగా టెస్ట్ చేశారు. ఇండియన్ ఇంజినీర్ సొంతంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ కావడం సంచలనంగా మారింది.ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ కాగా..ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉంది.
భవిష్యత్‌లో భారత్‌లో వ్యక్తిగత ఎయిర్ ట్రావెల్ ట్యాక్సీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా రవి తామ్టా పేర్కొన్నారు. అయితే…కమర్షియల్‌గా అందుబాటులోకి రావాలంటే ఇంకా ఎన్నో ఇంజినీరింగ్ పరీక్షలు, సేఫ్టీ టెస్టులు, ప్రభుత్వ అనుమతులు పొందాల్సి ఉందని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఫ్లయింగ్ ట్యాక్సీలు
ప్రపంచవ్యాప్తంగా చైనా, దుబాయ్, అమెరికా దేశాలలో కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశంలోనూ ఐఐటీ మద్రాస్ స్టార్టప్‌లు, వివిధ సంస్థలు స్థానికంగా ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ ట్యాక్సీల రూపకల్పనపై పరిశోధనలు వేగవంతం చేశాయి. ఫ్లైయింగ్ టాక్సీలు (ఎయిర్ ట్యాక్సీలు) హెలికాప్టర్ లాగా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు (eVTOL). ఇవి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గంటకు 240-320 కి.మీ వేగంతో ప్రయాణించి, రోడ్డు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తాయి.
రోడ్డుపై గంట నుంచి గంటన్నర పట్టే దూరాన్ని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. అత్యవసర వైద్య సేవల కోసం (ఎయిర్ అంబులెన్స్), నగరాల మధ్య, విమానాశ్రయాలకు వేగంగా వెళ్లడానికి ఇవి ఉపయోగపడతాయి.
ఐఐటీ మద్రాస్ స్టార్టప్ తయారు చేసిన భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ’e200X – PT01′ ఫుల్-స్కేల్ ప్రోటోటైప్‌ను ఇటీవల ఆవిష్కరించారు. దీంతోట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఇండియన్ ఇంజినీర్ సొంతంగా తయారు చేసిన
ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్!!! 🚀ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన ఇన్నోవేటర్ రవి తామ్టా…
తన స్టార్టప్ హపిడా స్కై రూపొందించిన
HAPIDA SKYNeX ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను విజయవంతంగా టెస్ట్ చేశారు.ఇది… pic.twitter.com/7AMTwylK3m
— Ravi Prakash Official (@raviprakash_rtv) August 7, 2026