చౌక‌బారు షాంపూపై వ‌ధువు ఆగ్ర‌హం.. ర‌ద్దయిన పెళ్లి

విధాత‌: వ‌ర‌క‌ట్నం ఇవ్వ‌లేద‌నో, కానుక‌లు స‌మ‌ర్పించ‌లేద‌నో పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన ఘ‌ట‌న‌లు చూశాం. కానీ ఇది వింత ఘ‌ట‌న‌. కేవ‌లం షాంపూ కోసం వివాహం ర‌ద్దు అయింది. చౌక‌బారు షాంపూ ఎందుకు పంపావ‌ని వ‌ధువు.. వ‌రుడిని నిల‌దీసినందుకు పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ ఘ‌ట‌న అసోంలోని గువాహ‌టిలో చోటు చేసుకుంది. గువాహ‌టికి చెందిన ఓ ఇంజినీర్‌కు వివాహం నిశ్చ‌య‌మైంది. ఇక పెళ్లికి ఆరు గంటల ముందు.. వ‌ధువుకు విలువైన కానుక‌లు, ఇత‌ర వ‌స్తువులు వ‌రుడి కుటుంబ స‌భ్యులు […]

  • Publish Date - December 11, 2022 / 06:29 AM IST

విధాత‌: వ‌ర‌క‌ట్నం ఇవ్వ‌లేద‌నో, కానుక‌లు స‌మ‌ర్పించ‌లేద‌నో పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన ఘ‌ట‌న‌లు చూశాం. కానీ ఇది వింత ఘ‌ట‌న‌. కేవ‌లం షాంపూ కోసం వివాహం ర‌ద్దు అయింది. చౌక‌బారు షాంపూ ఎందుకు పంపావ‌ని వ‌ధువు.. వ‌రుడిని నిల‌దీసినందుకు పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ ఘ‌ట‌న అసోంలోని గువాహ‌టిలో చోటు చేసుకుంది.

గువాహ‌టికి చెందిన ఓ ఇంజినీర్‌కు వివాహం నిశ్చ‌య‌మైంది. ఇక పెళ్లికి ఆరు గంటల ముందు.. వ‌ధువుకు విలువైన కానుక‌లు, ఇత‌ర వ‌స్తువులు వ‌రుడి కుటుంబ స‌భ్యులు పంపించారు. ఇక కానుక‌ల‌ను, వ‌స్తువుల‌ను చూసేందుకు వ‌ధువు తెగ ఆస‌క్తి క‌న‌బ‌రిచింది.

కానుక‌ల‌న్నీ బాగానే ఉన్నాయి. కానీ అత్తింటి వారు పంపిన షాంపూ త‌క్కువ ధ‌ర‌ది కావ‌డంతో పెళ్లి కుమార్తెకు కోపం వ‌చ్చింది. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. వ‌రుడికి వాట్సాప్‌లో ఈ విధంగా మేసేజ్ చేసింది. నీ స్థాయి ఇంతేనా అని నిల‌దీసింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వ‌రుడు త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని ఇంట్లో చెప్పేశాడు.

విష‌యం తెలుసుకున్న పేరెంట్స్ వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌ను ఫోన్‌లో సంప్ర‌దించారు. వ‌ధువు కుటుంబ స‌భ్యులు వ‌రుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వ‌రుడు త‌గ్గ‌లేదు. త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని ఉద్ఘాటించారు. దీంతో చేసేదేమీ లేక వ‌ధువు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.