Andhra Pradesh Railway Crime | నడుస్తున్న రైలులో మహిళపై లైంగిక దాడి .!

గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న సంత్రగాచి-సికింద్రాబాద్ రైలులో మహిళపై లైంగిక దాడి. కత్తితో బెదిరించి దాడి చేసిన దుండగుడు హ్యాండ్‌బ్యాగ్‌తో పెద్దకూరపాడు స్టేషన్‌లో పరారయ్యాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman raped, robbed aboard moving train between Guntur and Peddakurapadu

విధాత : గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైలులో ఓ మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
మహిళనలు కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన దుండగుడు ఆమె హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. నిందితుడు ఏపీలోని పెద్దకూరపాడు రైల్వే స్టేషన్‌లో దిగిపోయినట్లుగా గుర్తించారు. బాధితురాలు చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంత్రగాచి-సికింద్రాబాద్‌ రైలు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన రైలు గుంటూరుకు చేరుకున్న తర్వాత..ఓ బోగీలో ఒక మహిళా ప్రయాణికురాలు మాత్రమే కూర్చుని ఉంది. ఇంతలో ట్రైన్‌ కదిలే సమయంలో ఓ వ్యక్తి(40) ఆమె ఉన్న బోగీలో ఎక్కాడు. రైలు కొంత దూరం వెళ్లాక.. బోగీలో ఎవరూ లేకపోవడంతో నిందితుడు మహిళను బెదిరింపులకు గురిచేశారు. కత్తితో బెదిరించి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని మరో స్టేషన్‌లో దిగి పారిపోయాడు. ఈ ఘటన గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంతరం, రైలు చర్లపల్లికి చేరుకోగానే బాధితురాలు.. రైల్వే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటన రైలు ప్రయాణాల్లో మహిళల భద్రత విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.