CM Chandrababu Naidu : గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నాం

సీఎం చంద్రబాబు : ఏపీ కొత్త గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి ప్రారంభోత్సవం, సీంలు భూమి సమీకరణతో నిర్మాణం చేపట్టనున్నాం

CM Chandrababu Naidu

అమరావతి, విధాత: ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సోవమారం సీఆర్డీయే కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడింది. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారు. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారన్నారు. రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయితీ పెట్టిందని, రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

బెస్ట్ రాజధాని, గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి భూమి కావాలి, ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమాన పడ్డారన్నారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు నాకు దారి చూపారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూసమీకరణ జరిగింది ఒక్క అమరావతిలోనేనన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు నా విజన్ చెబితే అవహేళన చేశారు. హైదరాబాద్‌లో 5వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించామని, అక్కడ భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారని సీఎం చంద్రబాబు తెలిపారు.