రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల్ని రివర్స్ – రెండేళ్లల్లో ఒక్క ఎకరాకైనా నీరందించారా?
నారా చంద్రబాబు నాయుడు
విధాత:టీడీపీ 5 ఏళ్ల పాలనలో సాగు, తాగు నీటి అవసరాలను తీర్చాలని అనుక్షణం ప్రయత్నించాం. 69 ప్రాజెక్టులను చేపట్టి 24 ప్రాజెక్టులను పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించాం. గోదావరి నది మీద పోలవరం పూర్తి చేసి ఉత్తరాంద్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు తీసుకువెళ్లాలి. పెన్నా నదితో అనుసంధానం చేయాలని చూశాం. ప్రాజెక్టుల దగ్గరే పడుకొని పనులు పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమను తేవడం అంటే దానిని అభివృద్ధి అంటాం. పట్టిసీను ఏడాదిలో పూర్తి చేసి నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం. పురుషోత్తమ పట్నం పూర్తికి ప్రయత్నించాం.
రెండేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు మించి వ్యయం చేయలేదు. ప్రభుత్వం చేతగాని తనంతో గాలేరు నగరిని అటకెక్కించారు. హంద్రీ నీవా పనులు నిలపివేశారు. తెలుగుదేశం హయాంలో గొలుసు కట్టు చెరువులను పునరుద్దరించాం. నేటి ప్రభుత్వం ఒక్క చెరువునైనా బాగు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఎడారిగా మారే అనంతపురం జిల్లాలో 8 లక్షల ఫాం పాండ్స్ తొవ్వి నీరందించాం. భూగర్బ జలాలను పెంచాం. ఒక్క ఎకరాకు నీటి సమస్య లేకుండా చేయాలని ప్రతిపక్షం ప్రయత్నించాం. రాయలసీమ రాళ్ల సీమ మారిపోతుందనే సమయంలో తెలుగుగంగ ద్వారా ఎన్టీఆర్ ఆశ చూపించారు. రివర్స్ టెండర్ పేరుతో ప్రాజెక్టులన్నింటిని రివర్స్ తీసుకువెళ్లారు. ప్రభుత్వ చర్యలకు ప్రాజెక్టులు పూర్తి అవ్వటానికి కనీసం 100 ఏళ్లు పడుతుంది.
రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వ్యవసాయం పెరగాలి, పరిశ్రమలు పెరగాలి. వ్యవయసాయంలో వరుసగా 5 ఏళ్లు 11 శాతం జీఎస్డీపీ సాధించిన ఘనత టీడీపీదీ. పులివెందులకు నీళ్లందించి చీని చెట్టలను కాపాడాం. రైతులకు అరకొర సాయం అందించి పత్రికా ప్రకటనలు ఇష్టానుసాంగా ఇస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు దగా చేశారు. సున్నావడ్డీ పేరు మీద అసెంబ్లీ సాక్షిగా తప్పుడు ప్రచారాలు చేశారు. ధాన్యం కొలుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి. బకాయిలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా రాజధాని ప్రాంతంలో రైతులను భాగస్వామ్యులుగా చేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం రైతులను దోపిడి చేస్తూ రైతు ద్రోహి ప్రభుత్వంగా మారిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు ఒక్క ఎకరాల భూసేకరణ చేశారా? ఒక్క పునరావాసం కల్పించారా?
పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, ఇప్పటికే అమరావతి అనేక కంటిని పొడిచేశారు. పేద వాళ్లకు ఇచ్చే పెన్షన్లు, పిల్లలకు ఇచ్చే వాటిని కూడా ప్రభుత్వం కలిపి లెక్క చెబుతుంది. అవ్వన్ని లెక్కకడితే రూ.10 లక్షల బడ్జెట్ కు పోతుంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విత్తనాల సరఫరా ఆగిపోయింది. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేయాలని చూశాం. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి పరిచాం. ప్రకృతి సేధ్యంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాం. వ్యవసాయాన్ని దుక్చూచిగా మార్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తే, వ్యవసాయ రంగాన్ని నీరుగార్చే విధంగా వైసీపీ ప్రయత్నిస్తుంది.
నీటి పారుదల రంగానికి నిధులు ఎక్కడెక్కడ వ్యయం చేశారో చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి టీడీపీ ప్రజలనే నమ్ముకుంటుంది. ఉన్మాదంతో ప్రజలను పిరికి వారిగా మారుస్తున్నారు. కర్నూలులో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేయబోతే జగన్ రెడ్డి దానిని నిలిపివేశారు. సాగు నీటి ప్రాజెక్టులను అశ్రద్ధ చేసినా, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోయినా అవే జగన్ రెడ్డికి శాపాలుగా మారతాయి.