Roja | పాలాభిషేకం కాదు.. రోజాకి రోజాభిషేకం.. వైర‌ల్ వీడియో

రాజ‌కీయాల్లో పాలాభిషేకాలు చేశాం. ఆయా పార్టీల రాజ‌కీయ నాయ‌కులు మంచి నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడు.. వారి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేయ‌డం స‌హ‌జ‌మే

  • Publish Date - May 23, 2024 / 03:01 PM IST

రాజ‌కీయాల్లో పాలాభిషేకాలు చేశాం. ఆయా పార్టీల రాజ‌కీయ నాయ‌కులు మంచి నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్పుడు.. వారి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేయ‌డం స‌హ‌జ‌మే. లీట‌ర్ల కొద్ది పాల‌తో వారి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేసి త‌మ కృత‌జ్ఞ‌త భావాన్ని చాటుకుంటారు. పెద్ద పెద్ద గ‌జమాల‌లు స‌మ‌ర్పించి వారి ప‌ట్ల గౌర‌వాన్ని చాటుతారు. ఇక ఇప్పుడు కొత్త ట్రెండ్ మొద‌లైంది. జ‌నాలు పాలాభిషేకాలు మ‌రిచిపోయారు. రోజాభిషేకాల‌కు నాంది ప‌లికారు.

వైఎస్సార్‌సీపీ నాయ‌కురాలు రోజా ప‌ట్ల ఆమె మ‌ద్ద‌తుదారులు, అభిమానులు గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఓ కార్య‌క్ర‌మానికి రోజా హాజ‌రు కాగా, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. రోజాకు రోజాభిషేకం చేశారు. కొన్ని కిలోల రోజా పువ్వుల‌ను ఆమెపై వెద‌జ‌ల్లుతూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. రోజా కూడా ఆ రోజాభిషేకాన్ని ఎంతో ఎంజాయ్ చేసింది. అయ్య బాబోయ్ అంటూ ఆమె చిరున‌వ్వు చిందించారు. రోజా రోజాభిషేకం వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి.

Latest News