Site icon vidhaatha

Bra straps | ‘బ్రా స్ట్రాప్స్‌’ మీ అందానికి మచ్చ తెస్తున్నాయా.. అయితే ఈ టిప్స్‌ మీ కోస‌మే..!

Bra straps : మ‌హిళ‌లు తమ ఎద భాగం అందంగా కనిపించడం కోసం, సౌకర్యవంతంగా ఉండటం కోసం సాధార‌ణంగా ‘బ్రా’ల‌ను ధరిస్తుంటారు. అయితే ఇలా ‘బ్రా’లు ధరించే కొంద‌రిలో బ్రా స్ట్రాప్స్‌ కింద మచ్చలు ఏర్పడుతాయి. బ్రా స్ట్రాప్స్ చ‌ర్మానికి బిగ్గర‌గా అతుక్కుని ఉండ‌టంవ‌ల్ల వాటి కింద ఉన్న చ‌ర్మం రంగు మారుతుంది. శరీరం రంగుతో పోల్చితే బ్రా స్ట్రాప్స్ కింది చ‌ర్మం కొంత‌ తెల్లగానో, నల్లగానో, ఎర్రగా కమిలినట్లుగానో ఉంటుంది. చిన్నచిన్న చిట్కాలు పాటించ‌డం ద్వారా ఈ బ్రా మచ్చల స‌మ‌స్యకు చ‌క్కటి ప‌రిష్కారం ల‌భిస్తుంది. మ‌రి ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..

చిట్కాలు

పాలు, బాదం నూనె మిశ్రమం

బ్రా స్ట్రాప్స్‌వల్ల మచ్చలు ఏర్పడినచోట పాలు, బాదాం నూనె మిశ్రమాన్ని రాసి మృదువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత మిశ్రమం రాసిన ప్రదేశాన్ని శుభ్రమైన వ‌స్త్రంతో క‌ప్పేయాలి. పది నిమిషాల త‌ర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. అయితే క‌డ‌గ‌డానికి సబ్బు వాడ‌కూడ‌దు. ఇలా తరచూ చేస్తే బ్రా స్ట్రాప్స్‌ మచ్చలు మాయమవుతాయి.

నిమ్మ రసం, చక్కెర మిశ్రమం

చెంచా చక్కెరలో అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మరకలున్నచోట రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయ‌డంవ‌ల్ల క్రమంగా మచ్చలు త‌గ్గిపోతాయి.

సన్‌స్క్రీన్ లోష‌న్‌

స‌న్‌స్క్రీన్ లోష‌న్‌ను తరచూ చ‌ర్మానికి రాసుకోవ‌డం ద్వారా సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. దాంతో ఒంటిపై బ్రా స్ట్రాప్స్ ఏర్పడ‌కుండా చూసుకోవ‌చ్చు. పాత మ‌ర‌క‌లు మ‌రింత పెరగకుండా చేసుకోవ‌చ్చు.

పెరుగు, పసుపు మిశ్రమం

ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఆ త‌ర్వాత ఆ మిశ్రమాన్ని బ్రా మచ్చలున్నచోట రాయాలి. ఇలా తరచూ రాస్తుంటే మెల్లమెల్లగా మార్పు క‌నిపిస్తుంది.

ఎస్సెన్షియల్‌ నూనెలు

లావెండర్ లాంటి ఎస్సెన్షియ‌ల్ నూనెలు బ్రా స్ట్రాప్స్‌ను పోగొట్టడంలో బాగా ప‌నిచేస్తాయి. బ్రా మ‌ర‌క‌ల‌పై ఈ నూనెలను మృదువుగా రుద్దాలి. దాంతో ఆ నూనెల నుంచి పోషకాలు అంది చర్మం కాంతులీనుతుంది.

వాటర్‌ థెరపీ

చర్మం ఆరోగ్యానికి నీళ్లు కూడా చాలా అవసరం. తగినన్ని నీళ్లు తాగడంవల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా తాజాగా కాంతులీనుతుంది. అదేవిధంగా చ‌ర్మంపై మరకలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

Exit mobile version