Pimples | మొటిమలతో ముఖం చూపించలేకపోతున్నారా.. ఈ టిప్స్‌ మీ కోసమే..

Pimples | యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్‌ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయినా సమస్య తగ్గక ఆవేదన చెందుతుంటారు.

  • Publish Date - May 15, 2024 / 09:30 PM IST

Pimples | యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్‌ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయినా సమస్య తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమల సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

చిట్కాలు

  • చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్‌ చేస్తుండాలి. స్క్రబ్‌ చేయడంవల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. దానివల్ల మొటిమలు రావు. అయితే ఇప్పటికే మొటిమల సమస్యతో బాధపడుతుంటే స్క్రబ్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబింగ్‌ చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది.
  • అదేవిధంగా ముఖాన్ని ఎప్పుడు శుభ్రంగా కడుగుతుండాలి. తరచూ కడగడంవల్ల ఫేస్‌ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. అలా అని అతిగా ముఖాన్ని కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
  • ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. జంక్‌ ఫుడ్‌ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్‌ ఫుడ్‌ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతుండాలి.

Latest News