Site icon vidhaatha

Beauty tips | ముఖంపై మచ్చలు మీ అందాన్ని తగ్గిస్తున్నాయా.. అయితే ఈ స్పెషల్‌ టిప్స్‌ మీ కోసమే..!

Beauty tips : పగటిపూట బయటికి వెళ్లినప్పుడు ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. చర్మం నల్లగా మారుతుంది. ఇవి మన అందాన్ని తగ్గించేస్తాయి. మగవాళ్లలో చాలామంది వీటిని లైట్‌గా తీసుకుంటారు. కానీ మహిళల్లో మాత్రం చాలామంది తమ అందం తరిగిపోతున్నదని ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారు సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చిట్కాలు

సూర్యరశ్మి కారణంగా నల్లగా మారిన చర్మం నాజూగ్గా మారాలన్నా, మొటిమలు మటుమాయం కావాలన్నా బీట్‌రూట్ క్రీమ్‌, బీట్‌రూట్‌ ఫేస్‌ ప్యాక్ ఉత్తమమైన పరిష్కారాలు. అందుకోసం ముందుగా ఈ బీట్‌రూట్‌ క్రీమ్‌ను ఎలా తయారు చేయాలి..? దాన్ని ఎలా అప్లయ్‌ చేసుకోవాలి..? బీట్‌రూట్‌ ఫేస్‌ ప్యాక్‌ ఎలా వేసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బీట్‌ రూట్‌ క్రీమ్‌

ముందుగా తొక్కతీసిన అరకప్పు బీట్‌రూట్‌ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. తర్వాత వాటిలో అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆపేసి, బీట్‌రూట్‌ ముక్కల్లో టీస్పూన్ సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత బీట్‌రూట్‌ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్, రెండు టీస్పూన్‌ల అలోవెరా జెల్‌ వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిలువ చేసుకోవాలి. వారం రోజులపాటు నిలువ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుముఖం పడుతాయి. ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

బీట్‌రూట్ ఫేస్ ప్యాక్

బీట్‌రూట్‌ ఫేస్‌ ప్యాక్‌ కూడా చర్మ సమస్యలను దూరం చేసి, చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఫేస్‌ ప్యాక్‌ కోసం ముందుగా బీట్‌రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్‌ చేయాలి. మెడ మీద కూడా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత 15 నిమిషాలపాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పాలు కలుపుతాం కాబట్టి చర్మం మృదువుగా కూడా మారుతుంది.

కాగా చర్మ సమస్యలను దూరం చేసి టోన్‌ చేయడంలో బీట్‌రూట్ బాగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్‌రూట్‌లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్.. ఫెయిర్ స్కిన్‌టోన్‌ను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యలను దూరం చేసి, చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పొట్ట స్లిమ్‌గా ఉండాలంటే ఈ ఐదు పదార్థాలను పక్కన పెట్టాల్సిందే..!

అందాన్ని రెట్టింపు చేసే ఈ 5 రకాల బ్లాక్‌ డ్రెస్‌లను ఎప్పుడైనా ట్రై చేశారా..?

నడుము చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే ఈ ఐదు మార్నింగ్ డ్రింక్స్ గురించి మీకు తెలుసా..?

యుక్త వయస్సులోనే జుట్టు రాలిపోతోందని బాధా.. డోంట్ వర్రీ..!

మీ ముఖం మిలమిలా మెరవాలంటే వారానికోసారి ఈ ఫేస్‌ మాస్క్‌ వేసుకోండి..!

Exit mobile version