Site icon vidhaatha

Beauty tips | అందాన్ని రెట్టింపు చేసే ఈ 5 రకాల బ్లాక్‌ డ్రెస్‌లను ఎప్పుడైనా ట్రై చేశారా..?

Beauty tips : న‌ల్లని దుస్తులను ఎక్కువ మంది ఇష్టప‌డ‌రు. న‌లుపు త‌మ‌కు అచ్చిరాద‌నే సెంటిమెంట్ కొంద‌రికి ఉంటుంది. కానీ, అలాంటి సెంటిమెంట్‌లు ఏవీ లేక‌పోతే మాత్రం యువ‌తుల‌కు కొన్ని ర‌కాల న‌లుపు దుస్తులు ప్రత్యేక క‌ళ‌ను తెచ్చిపెడుతాయి. పార్టీల్లోగానీ, వీకెండ్ గెట్అవేల్లోగానీ, డిన్నర్ డేట్‌ల‌లోగానీ, ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్‌ల‌లోగానీ మ‌గువ‌ల‌కు న‌లుపు దుస్తులు తెచ్చే క‌ళ వ‌ర్ణానీతం. వ‌య‌సు, బరువుతో సంబంధం లేకుండా న‌లుపు దుస్తులు మ‌హిళల‌ అందాన్ని రెట్టింపు చేస్తాయి. కాబ‌ట్టి ప్రతి యువ‌తి ద‌గ్గర ఉండాల్సిన ఓ ఐదు ర‌కాల న‌లుపు దుస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. బాడీకాన్ డ్రెస్ (Bodycon dress)

శ‌రీరాన్ని హ‌త్తుకున్న‌ట్లుగా ఉండే ఈ బ్లాక్‌ బాడీకాన్ డ్రెస్ నైట్ అవుట్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ధ‌రిస్తే అద్భుతంగా ఉంటుంది. పార్టీ ఏది అనే దానితో సంబంధం లేకుండా ఏ మ‌హిళ అయినా ఈ బాడీకాన్ డ్రెస్‌లో వెళ్తే అందం అదిరిపోతుంది. ట్రెండీగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపంచ‌డంలో మ‌రే డ్రెస్ కూడా ఈ బాడీకాన్ డ్రెస్‌ను బీట్ చేయ‌లేదు.

2. ఆఫ్ షోల్డ‌ర్ డ్రెస్ (Off shoulder dress)

మ‌గువ‌ల‌ కాల‌ర్‌బోన్‌ను బ‌య‌టికి ప్ర‌ద‌ర్శించేలా ఉండే ఈ బ్లాక్ ఆఫ్ షోల్డ‌ర్ డ్రెస్ వారికి కొత్త లుక్‌ను తెచ్చిపెడుతుంది. ఈ డ్రెస్‌లో పార్టీల‌కు వెళ్తే సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగాను, శృంగార క‌న్య‌ళ్లాను క‌నిపిస్తారు. వీటికి తోడు సిల్కీ కాళ్ల‌జోడు ధ‌రిస్తే మీ దుస్తుల అందం మ‌రింత పెరుగుతుంది.

3. స్పాగెట్టి డ్రెస్ (Spaghetti Dress)

భుజాల మీదికి స‌న్న‌ని స్ట్రాప్స్‌తో ఉండే ఈ న‌లుపు వ‌స్త్రాలు యువ‌తుల‌కు సెక్సీ లుక్‌ను తెచ్చిపెడుతాయి. బ్లాక్ స్పాగెట్టి డ్రెస్ ఇప్పుడు అత్యంత ఫ్యాష‌నెబుల్ డ్రెస్‌. నేడు యువ‌తులు, ఫ్యాష‌న్ నిపుణులు ఎక్కువ‌గా ఈ స్పాగెట్టి డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ డ్రెస్‌పై యాక్స‌స‌రీస్‌ను స‌రిగ్గా ధ‌రిస్తే యువ‌తుల లుక్ అదిరిపోతుంది.

4. సెక్విన్ డ్రెస్ (Sequin Dress)

ఈ బ్లాక్ సెక్విన్ డ్రెస్ అన్ని ర‌కాల పార్టీల‌కు అద్భుతంగా సూట‌వుతుంది. సెక్విన్ డ్రెస్ ధ‌రిస్తే ఇత‌ర యాక్సెస‌రీస్ ఎక్కువ‌గా అలంక‌రించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. త‌క్కువ యాక్సెస‌రీస్ వేసుకుని, ముఖాన్ని అందంగా మేక‌ప్ చేసుకుంటే స‌రిపోతుంది. యువ‌త మాత్ర‌మే హాజ‌ర‌య్యే పార్టీల్లో ఈ సెక్విన్ డ్రెస్ మ‌గువ‌ల‌ను ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌బెడుతుంది.

5. స్లిప్ ఆన్ డ్రెస్ (Slip-On Dress)

హ‌నీమూన్ లాంటి అకేష‌న్‌ల‌లో ఈ బ్లాక్ స్లిప్ ఆన్ డ్రెస్ ధ‌రిస్తే యువ‌తుల సొగ‌సు చూడ‌త‌రం కాదు. పైగా శ‌రీరానికి వ‌దులుగా సౌక‌ర్యవంతంగా ఉంటుంది. మ‌గువ మేనిని శోభాయ‌మానంగా క‌నిపించేలా చేస్తుంది. వేస‌విలో కూడా ఇలాంటి దుస్తులు ధ‌రించడం మంచి ఛాయిస్‌. దీనిపై డెనిమ్ లేదా బ్యాగీ ష‌ర్ట్ ధ‌రిస్తే లుక్ అదిరిపోతుంది.

ఇవి కూడా చదవండి 

Beauty tips | నడుము చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే ఈ ఐదు …

Beauty tips | యుక్త వయస్సులోనే జుట్టు రాలిపోతోందని బాధా.. డోంట్ వర్రీ..!

Beauty tips | వీటిని కొబ్బరి నూనెతో కలిపి పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా …

Beauty tips | మీ పసుపు రంగు పంటివరుస తెల్లగా మారాలా.. అయితే ఈ …

Exit mobile version