Beauty tips | మీ ముఖం మిలమిలా మెరవాలంటే వారానికోసారి ఈ ఫేస్‌ మాస్క్‌ వేసుకోండి..!

Beauty tips : కొందరి ముఖం మిలమిలా మెరుస్తుంటుంది. పదిమందిలో ఉన్నా వారే ప్రత్యేకంగా కనిపిస్తారు. మీ ముఖం కూడా అలా మెరవాలంటే ఎగ్‌ ఫేస్‌ మాస్క్‌ వేసుకోండి. గుడ్డు ఆరోగ్యానికి చేస్తుంది. ఇది సంపూర్ణ పోషకాహారం. రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తింటే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు.

  • Publish Date - June 25, 2024 / 08:30 PM IST

Beauty tips : కొందరి ముఖం మిలమిలా మెరుస్తుంటుంది. పదిమందిలో ఉన్నా వారే ప్రత్యేకంగా కనిపిస్తారు. మీ ముఖం కూడా అలా మెరవాలంటే ఎగ్‌ ఫేస్‌ మాస్క్‌ వేసుకోండి. గుడ్డు ఆరోగ్యానికి చేస్తుంది. ఇది సంపూర్ణ పోషకాహారం. రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తింటే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు.
అంతేగాక చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చడంలోనూ గుడ్డు బాగా పనిచేస్తుంది. వారానికి ఒక్కసారి ఎగ్ మాస్క్ (Egg Mask) వేసుకుంటే ముఖానికి నిగారింపు వస్తుంది. చర్మం మిలమిలా మెరుస్తుంది. మరి ఈ ఎగ్‌ మాస్క్‌ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డును పగులగొట్టి తెల్లసొనను మాత్రమే పోసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె (Coconut Oil), ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon Juice) వేసుకుని అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని పది నుంచి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి.
  • స్కిన్ పూర్తిగా డ్రై అయిపోతుంది. అప్పుడు చర్మాన్ని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఎగ్ మాస్క్‌ను వారానికి ఒకసారి వేసుకోవడంవల్ల స్కిన్ టైట్ అవుతుంది. ముడతలు, చారలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఈ ఎగ్ మాస్క్ చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఎగ్ మాస్క్ చాలా ప్రయోజనం చేకూరుతుంది.
  • అనేక విటమిన్లతో కూడి ఉండే ఈ ఎగ్ మాస్క్ పిగ్మెంటేషన్ సంబంధిత మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది. క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్‌ను మీ సొంతం చేస్తుంది. కాబట్టి మెరిసే అందమైన చర్మం కోసం ఈ ఎగ్ మాస్క్‌ను తప్పక ప్రయత్నించండి.

Latest News