ఇంగ్లీషోళ్ల‌తో అమీతుమీ తేల్చుకోనున్న భార‌త్.. ఈ ముగ్గురితోనే డేంజ‌ర్..!

  • Publish Date - January 20, 2024 / 12:13 AM IST

కొత్త సంవ‌త్స‌రంలో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఆఫ్ఘ‌నిస్తాన్‌పై టీ 20 సిరీస్ కూడా గెలిచింది. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడ‌నుంది. ఇంగ్లండ్ జట్టు తన ‘బేస్ బాల్’ తరహాలో టెస్ట్ క్రికెట్ ఆడతామంటూ ఇప్పటికే ప్రకటించ‌గా, భార‌త్ అందుకు త‌గ్గ‌ట్టుగా సిద్ధ‌మ‌వుతుంది.అయితే ఇంగ్లండ్‌లో ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్లు తమ జట్టును ఒంటరిగా గెలిపించే సత్తా ఉంది. వారిని కంట్రోల్ చేస్తే మ్యాచ్ మ‌న సొంతం అవుతుంది. ఇంత‌కు ఆ ముగ్గురు ఎవ‌రంటే జో రూట్.. ఇత‌ను టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు అతిపెద్ద ముప్పు అని చెప్పాలి. టెస్ట్ సిరీస్‌లో మంచి రికార్డ్ ఉంది. తన టెస్టు కెరీర్‌లో ఐదుసార్లు డబుల్ సెంచరీలు కూడా చేశాడు. 2021లో భారత్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జో రూట్ 368 పరుగులు చేశాడు.

ఇక మ‌రో బ్యాట్స్‌మెన్ బెన్‌ స్టోక్స్‌.. ఇత‌ను ఎన్న వికెట్స్ ప‌డిన సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ని గెలిపించే స‌త్తా ఉంది. టెస్టు క్రికెట్‌లో బెన్ స్టోక్స్ అత్యుత్తమ స్కోరు 258 పరుగులు. స్పిన్, ఫాస్ట్ బౌలర్లను బాగా ఆడటం బెన్ స్టోక్స్ ప్రత్యేకత. దూకుడు బ్యాటింగ్ బెన్ స్టోక్స్ అతిపెద్ద ఆయుధం. అతను భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో దీనిని ఉపయోగించనున్నాడు. ఇక మ‌రో వ్య‌క్తి జాక్ లీచ్.. భారత్ టర్నింగ్ పిచ్‌లపై ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ టీమ్ ఇండియాని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ మ‌ధ్య కాలంలో, జాక్ లీచ్ మ్యాచ్‌లో 5 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ ముగ్గురిని భార‌త ఆట‌గాళ్లు జాగ్ర‌త్త‌గా ఫేస్ చేస్తే ఇంగ్లీషోళ్ల‌పై గెల‌వ‌డం సులువే.

ఇక ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టు చూస్తే ..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.


జనవరి 25 నుంచి టెస్ట్ సిరీస్..

భారత్ జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. 3 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఇరుజట్లు 2021లో చివరిసారి తలపడ్డాయి. అయితే, ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకుంది.


భారత్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్..

1వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, జనవరి 25-29, హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)


2వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 2-6, విశాఖపట్నం (డా. వైఎస్ రాజశేఖర్ క్రికెట్ స్టేడియం)


3వ టెస్టు: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 15- 19 ఫిబ్రవరి, రాజ్‌కోట్ (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం)


4వ టెస్ట్: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, ఫిబ్రవరి 23-27, రాంచీ (JSCA ఇంటర్నేషనల్ స్టేడియం)


5వ టెస్ట్: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్, మార్చి 7-11, ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం).

Latest News