AUS vs ENG : యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం

గబ్బాలో జరిగిన యాషెస్ 2వ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యత. స్టార్క్ & నీసర్ హాట్ బౌలింగ్!

AUS vs ENG

విధాత : గబ్బా వేదికగా ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో అస్ట్రేలియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో అస్ట్రేలియా ఈ సిరీస్ లో 2-0 ఆధిక్యత సాధించింది.

ఇంగ్లాండ్ ఆదివారం నాల్గవ రోజున తన రెండో ఇన్నింగ్స్‌లో 134/6తో ఆటను ప్రారంభించి 241 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా విల్ జాక్స్ (41) పరుగులు చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అసీస్ బౌలర్ నీసర్ (5/42) ఐదు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ 2, బోలాండ్ 2, డగెట్ ఒక వికెట్ తీశారు. అనంతరం 65 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ (23*; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (22), జేక్ వెదర్‌రాల్డ్ (17*) పరుగులు చేసి అసీస్ కు విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 334 ఆలౌట్ అయింది. జో రూట్ (138), జాక్ క్రాలీ (76) మంచి స్కోర్లుతో రాణించినప్పటికి మిగతా బ్యాటర్ల వైఫల్యం చెందారు. అసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీశాడు. అస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో జేక్ వెదర్‌రాల్డ్ (72), లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61), కామెరూన్ గ్రీన్ (45), అలెక్స్ కేరీ (63), మిచెల్ స్టార్క్ (77) రాణించడంతో 511 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలకు 177 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 4, బెన్ స్టోక్స్ 3వికెట్లు పడగొట్టారు.

 

Latest News