భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానాతో పెళ్లి రద్దుపై మ్యూజిక్ డైరక్టర్ పలాశ్ ముచ్చల్ స్పందించారు. స్మృతి మంధాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాశ్ ఈ సోషల్ మీడియా ఖాతాలో వివరణ ఇవ్వడం గమనార్హం. నవంబర్ 23న జరుగాల్సిన స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
నేను జీవితంలో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను.. నా వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చానని ఇన్ స్ట్రా పోస్టులో తెలిపారు. నాపై వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. నాపై ఆధారాలు లేని వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నా జీవితంలో అత్యంత కష్టకాలం అని రాసుకొచ్చారు. ఇదే సమయంలో తనపై అసత్య ప్రచారం చేసే వారిని హెచ్చరించారు. సోర్స్ ఎవరో, ఏంటో ఎప్పటికీ తెలియని వదంతుల ఆధారంగా ఎవరినైనా జడ్జి చేసే సమయంలో.. ఈ సమాజం ఒక్కసారి ఆగి ఆలోచించాలన్నారు. ఇలాంటి అంశాల్లో మన మాటలు అవతలి వ్యక్తిని గాయపరుస్తాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. నా ప్రతిష్ఠకు, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినవారిపై మా లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచినవారికి ధన్యవాదాలు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
