భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్

గాల్లోకి నిమ్మకాయ లేపుతూ క్షుద్ర పూజలు చేస్తున్న మాజీ సర్పంచ్ వీడియో వైరల్. గిరిజనుల్లో భయభ్రాంతులు.. పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

విధాత : ఓ వైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ మాజీ సర్పంచ్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు చేస్తున్న తాంత్రిక, క్షుద్ర పూజలు అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేస్తూ గాల్లోకి నిమ్మకాయను లేపిన వీడియో వైరల్ అయ్యింది. డబ్బు కోసం నాగరాజు మూఢనమ్మకాలు వ్యాపింపజేస్తున్నాడని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

పగలు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ రాత్రి వేళ తన తాంత్రిక విద్యలతో జనాన్ని భయపెడుతున్నాడు. క్షుద్ర శక్తులను తన ఆధీనంలోకి తీసుకుంటానంటూ గ్రామంలోకి ఓ మాంత్రికుడిని తీసుకొచ్చి మరి పూజలు నిర్వహిస్తున్నాడు. నాగరాజు గతంలో నకిలీ పాస్ పుస్తకాల కేసులో జైలుకు వెళ్లాడు. నేర స్వభావంతో వ్యవహరించే నాగరాజు తాంత్రిక పూజల వ్యవహారం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Viral Video : ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో
రంగనాయక్ సాగర్ లో ఎత్తేస్తా: రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్

Latest News