విధాత : కాళేశ్వరం కూలిందని..కేసీఆర్, హరీష్ రావు లను బండకేసి కొట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి టి.హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటకు రా..నిన్ను రంగనాయక సాగర్ లో బండ కట్టి ఎత్తేస్తా.. నువ్వు మునుగుతావో.. తెలుతావో చూద్దాం,, నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు…నువ్వు తెలితే కాళేశ్వరం కూలినట్టు అని మాజీ మంత్రి టి.హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఒక ఇందిరమ్మ చీర ఇచ్చినాం..చీర చూసి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయమనే చిల్లర మాటలను రేవంత్ రెడ్డి మానివేయాలని..మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయవద్దని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ పాలనలో వరుసగా బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చారని..రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఒక చీరే ఇచ్చాడని.. అది కూడా సగం మందికే ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఓటు అడగాలి అంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బకాయిపడ్డ రూ. 60 వేలు డబ్బులు ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తేనే రైతులకు మేలు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే రైతులకు బోనస్ పడుతుందని, రుణమాఫీ అవుతుందని, రైతు భరోసా డబ్బులు వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుండి పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని, నేటికి పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే..మాది రైతు ప్రభుత్వం అంటున్నాడని, మొక్కజొన్న, ధాన్యం రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తున్నామని అంటున్నాడు కానీ.. 50 రోజులు అయిన డబ్బులు రైతుల ఖాతాల్లో పడటం లేదని హరీష్ రావు విమర్శించారు. యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధరకు తక్కువకు అమ్ముకుంటున్నారని, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయిపడ్డ రూ. 450 కోట్ల డబ్బులు విడుదల చేయాలన్నారు. చిన్నకోడూరులో 450 మంది రైతులు 59 రోజుల నుండి రూ. 45 కోట్లు రావాలని అంటున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Online Love Border Violation | పాక్‌లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
Manika Vishwakarma : మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
