విధాత : తన పర్యటనకు అధికారులు గైర్హాజర్ కావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పర్యటనకు వస్తే అధికారులు రారా అంటూ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుకుంట, కొండరెడ్ల గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.
మంత్రి పర్యటనకు హాజరు కాని అధికారుల వివరణ తీసుకోవాలని..నోటీసులు కాకుండా ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను, కలెక్టర్ వచ్చిన మీటింగ్ లకు కూడా డివిజనల్ అధికారులు డుమ్మా కొడితే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు.
TG: మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా
నేను పర్యటనకు వస్తే అధికారులు రారా అంటూ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుకుంట, కొండరెడ్ల గ్రామాల్లో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి పర్యటనకు హాజరు కాని అధికారులు.. ఒక్కసారి యాక్షన్… pic.twitter.com/VyXU2j6Q1O
— ChotaNews App (@ChotaNewsApp) December 27, 2025
ఇవి కూడా చదవండి :
CP Sajjanar : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?
Actor Shivaji : నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
