Bhadradri Kothagudem : భగీరథ నీటి సంపులో ముగ్గురి దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ సంపులోకి దిగి ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందగా, మరొకరి స్థితి విషమం.

Mission Bhagiratha Bhadradri Kothagudem

విధాత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) చర్ల మండలం ఉంజుపల్లిలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. మిషన్ భగీరథ నిర్మాణ పనుల్లో భాగంగా సంపులోకి వెళ్లిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

గ్రామంలో నిర్మిస్తున్న సంపుకు మంగళవారం స్లాబు వేస్తున్న క్రమంలో కార్మికులు కాకా మహేశ్‌ (36), లింగాపురం పాడుకు చెందిన నీలం తులసీరాం (37) లు మోటార్ వేసేందుకు సంపు నీటిలోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. వారి కోసం సంపు లోపలికి వెళ్లిన ఈష (48) కూడా తీవ్ర అస్వస్థతకు గురై చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సీఐ రాజు వర్మ, తహశీల్దార్‌ శ్రీనివాస్‌ లు దర్యాప్తు చేపట్టారు.