విధాత : ప్రకృతిలో రకరకాల జంతువులు భిన్నమైన జీవన శైలులతో మనుగడ సాగిస్తున్నాయి. కొన్ని విచిత్ర జంతువుల జీవన రీతులు అద్బుతంగా..వింతగా ఉంటు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఓ తొండ(బల్లి జాతి) తన రెండు కాళ్లపై నిటారుగా మనిషి మాదిరిగా పరుగెడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఫ్యాన్-థ్రోటెడ్ లిజార్డ్ (సిటానా పాంటిసెరియానా) పిలిచే మగ బల్లి(తొండ) ఓ రాళ్లతో కూడిన భూభాగంలో రెండుకాళ్లపై పరుగెడుతుంది. అది నీలం-నారింజ గొంతు భాగంతో ఉండే గంగడోలు(డ్యూలాప్‌లు) వంటి భాగాన్నివెలిగిస్తూ కాంతివంతంగా పరుగు తీస్తుంది. ఇంతకు అది ఎందుకిలా చేస్తుందో తెలుసుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. మగ తొండ తన తోడు కోసం ఆడతొండను ఆకర్షించేందుకు, అనుకూలమైన అవాసాన్ని వెతికే క్రమంలో అలా రంగులు ప్రదర్శిస్తూ..రెండుకాళ్లపై పరుగెడుతూ తన ప్రేమయాత్రను కొనసాగిస్తుందని నిపుణులు వెల్లడించారు.
దక్షిణాసియా అగామిడ్ జాతికి చెందిన ఫ్యాన్-థ్రోటెడ్ లిజార్డ్ బల్లులు లైంగిక డైమోర్ఫిజమ్‌ను ప్రదర్శిస్తాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బీబీసీ ఎర్త్ పోస్టు చేయగా..అది వైరల్ గా మారింది. ఈ రకమైన తొండలు(బల్లులు) భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్‌తో సహా దక్షిణాసియాలో కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఎగిరే డ్రాగన్ గా పిలిచేడ్రాకో వోలన్స్(బల్లులు) కూడా పిలుస్తుంటాయని..అవి కూడా అగామిడే కుటుంబంలోని బల్లి జాతికి చెందినవని నిపుణులు వెల్లడించారు.
Fan-throated lizards are small, colorful lizards found in shrublands and some parts of coastal areas in southeast Asia.
Video from BBC Earth.
More of the world’s weirdest animals: https://t.co/YlbnwzzGoH pic.twitter.com/1g0hI7ZJxB
— Fascinating (@fasc1nate) December 6, 2025
ఇవి కూడా చదవండి :
రంగనాయక్ సాగర్ లో ఎత్తేస్తా: రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్
Online Love Border Violation | పాక్‌లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
