Balapur Ganesh | బాలాపూర్ గ‌ణేశ్‌ ల‌డ్డూ వేలానికి 30 ఏండ్లు.. చ‌రిత్ర ఇదీ..!

Balapur Ganesh | వినాయ‌క న‌వ‌రాత్రులు అన‌గానే హైద‌రాబాద్ న‌గ‌రం అంద‌రికీ గుర్తొస్తోంది. ఇక గ‌ణేశుడి లడ్డూ అన‌గానే బాలాపూర్ ల‌డ్డూ గుర్తొస్తోంది. ఆ ల‌డ్డూ వేలం పాట కోసం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదురుచూస్తుంటారు. బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ వేలం ప్రారంభ‌మై 30 ఏండ్లు అవుతోంది. కాబ‌ట్టి ఈసారి ల‌డ్డూ స‌రికొత్త రికార్డు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని భ‌క్తులు భావిస్తున్నారు. 1994లో ల‌డ్డూ వేలం ప్రారంభం కాగా, స్థానిక రైతు కొల‌ను మోహ‌న్ రెడ్డి […]

Balapur Ganesh | వినాయ‌క న‌వ‌రాత్రులు అన‌గానే హైద‌రాబాద్ న‌గ‌రం అంద‌రికీ గుర్తొస్తోంది. ఇక గ‌ణేశుడి లడ్డూ అన‌గానే బాలాపూర్ ల‌డ్డూ గుర్తొస్తోంది. ఆ ల‌డ్డూ వేలం పాట కోసం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదురుచూస్తుంటారు. బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ వేలం ప్రారంభ‌మై 30 ఏండ్లు అవుతోంది. కాబ‌ట్టి ఈసారి ల‌డ్డూ స‌రికొత్త రికార్డు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని భ‌క్తులు భావిస్తున్నారు. 1994లో ల‌డ్డూ వేలం ప్రారంభం కాగా, స్థానిక రైతు కొల‌ను మోహ‌న్ రెడ్డి రూ. 450కి ద‌క్కించుకున్నారు. 2022లో స్థానిక రైతు వంగేటి ల‌క్ష్మా రెడ్డి రూ. 24.60 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ఉంద‌ని బాలాపూర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి ప్రెసిడెంట్ క‌ల్లెం నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 21 కేజీల ల‌డ్డూకు మ‌రికాసేప‌ట్లో వేలం ప్రారంభం కానుంది. ఈ వేలం పాట‌లో స్థానికుల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల వారు కూడా పాల్గొననున్నారు. అయితే తొలిసారి ల‌డ్డూ ద‌క్కించుకున్న మోహ‌న్ రెడ్డి.. ఆ ల‌డ్డూను త‌న పొలంలో చ‌ల్ల‌డంతో దిగుబ‌డి గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని వారి న‌మ్మ‌కం. అంతేకాకుండా బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ ఆరోగ్యం, సంప‌ద‌, శ్రేయ‌స్సును క‌లిగిస్తుంద‌నేది భ‌క్తుల న‌మ్మ‌కం. దీంతో ఆ ల‌డ్డూ విశేష ఆద‌ర‌ణ పొందింది. మొత్తంగా వేలం పాట‌లో ల‌డ్డూను ద‌క్కించుకునేందుకు తీవ్ర‌మైన పోటీ ఉంటుంది.

లడ్డూ వేలం-విజేతలు

1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450

1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500

1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు

1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు

1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు

1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి- రూ.65 వేలు

2000 కొలన్‌ అంజిరెడ్డి- రూ.66 వేలు

2001 జీ రఘనందన్‌ రెడ్డి- రూ.85 వేలు

2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000

2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి- రూ.1,55,000

2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.2,01,000

2005లో ఇబ్రహీ శేఖర్‌- రూ.2,08,000

2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు

2007లో జీ రఘనాథమ్‌ చారి- రూ.4,15000

2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.5,07,000

2009లో సరిత- రూ.5,10,000

2010లో కొడాలి శ్రీదర్‌ బాబు- రూ.5,35,000

2011లో కొలన్‌ బ్రదర్స్‌- రూ.5,45,000

2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి- రూ.7,50,000

2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి- రూ.9,50,000

2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి- రూ.10,32,000

2016లో స్కైలాబ్‌ రెడ్డి- రూ.14,65,000

2017లో రూ.15 లక్షలు

2018లో శ్రీనివాస్‌ గుప్తా- రూ.16,60,000

2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు

2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు

2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌- రూ.18.90 లక్షలు

2022లో వంగేటి ల‌క్ష్మారెడ్డి – రూ. 24.60 ల‌క్ష‌లు