విధాత: సెట్స్‌పై ఉన్న సినిమాకు సంబంధించి అప్‌డేట్ అడిగితే.. ఆ సినిమా మేకర్స్ ఏదైనా చెబుతారు కానీ.. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని సినిమాకు సంబంధించి అప్‌డేట్ కావాలంటూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న అతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది.
ఆదివారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొందరు.. ‘పుష్ప 2’ అప్‌డేట్ కావాలంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ముందు ఆందోళనకు దిగారు. నిజంగా ఇది అతి కాకపోతే.. అభిమానించే హీరో ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం ఏమిటో వారికే తెలియాలి.
AP,TG ,Kerala , Karnataka,TN,UAE…..
Offline campaign about #Pushpa2 updates is on full HEAT all over