పార్లే-జీ బిస్కెట్లు ఎంతో ఫేమస్. అసలు ఆ బిస్కెట్లను తినని వారు ఎవరూ ఉండరు. పార్లే-జీ బిస్కెట్లతో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. చాలా మంది చాయ్‌తో కలిపి పార్లే-జీ బిస్కెట్లను తింటుంటారు. ఇప్పటికీ ఆ బిస్కెట్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. అయితే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పార్లే-జీ బిస్కెట్లపై ఇప్పుడు నెట్టింట చర్చ జోరందుకుంది. ఎందుకంటే.. డార్క్ పార్లే-జీ అనే పేరుతో చాక్లెట్ ఫ్లేవర్‌తో బిస్కెట్లు మార్కెట్‌లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ కొత్త రకం చూడడానికి నలుపు రంగులో ఉన్నాయి. అసలు ఇది నిజమా..? అనేది తేలాల్సి ఉంది.
స్పందించని పార్లే కంపెనీ..
డార్క్ పార్లే-జీ బిస్కెట్లపై ఇప్పటి వరకు సదరు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఎక్కడా పేర్కొనలేదు. కేవలం సోషల్ మీడియాలోనే డార్క్ పార్లే-జీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చాయ్‌తో పార్లే-జీ బ్రేకప్ కావడంతో అది ఇప్పుడు డార్క్‌గా మారిందని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఏఐ టెక్నాలజీతో పార్లే-జీ డార్క్ బిస్కెట్లను సృష్టించి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి డార్క్ పార్లే-జీ బిస్కెట్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.