Khanapur | ఖానాపూర్‌: తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల నిరసన ధర్నా .

Khanapur | విధాత ప్రతినిధి ,ఉమ్మడి అదిలాబాద్: ఆరు గాలం కష్టపడి నిద్రాహారాలు మాని పంట పొలాలకు కాపల కాచి పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్ద అవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . నిన్న అర్ధరాత్రి నుండి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వడ్లు పూర్తిగా తడిసిపోయినవి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కడెం ఖానాపూర్ నిర్మల్ మంచిర్యాల చెన్నూరు కోటపల్లి మండలాల్లో కురిసిన అకాల భారీ వర్షానికి కళ్ళల్లోన […]

  • Publish Date - May 30, 2023 / 06:12 PM IST

Khanapur |

విధాత ప్రతినిధి ,ఉమ్మడి అదిలాబాద్: ఆరు గాలం కష్టపడి నిద్రాహారాలు మాని పంట పొలాలకు కాపల కాచి పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్ద అవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . నిన్న అర్ధరాత్రి నుండి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వడ్లు పూర్తిగా తడిసిపోయినవి

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కడెం ఖానాపూర్ నిర్మల్ మంచిర్యాల చెన్నూరు కోటపల్లి మండలాల్లో కురిసిన అకాల భారీ వర్షానికి కళ్ళల్లోన వడ్లు తడిసి పోయినవి. అకాల భారీ వర్షానికి ఖానాపూర్ వ్యవసాయ మార్కెటు చిన్నపాటి చెరువును తలపించింది ఆ నీళ్లలో పంట పూర్తిగా మునిగిపోయింది భారీ ఎత్తున గాలి రావడంతో వరి ధాన్యం పైన గప్పిన కవర్లు సైతం ఎగిరిపోవడం వర్షంనీరు భారీగా నిల్వ కావడంతో వ్యవసాయ మార్కెట్లో విక్రయించడానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది

గాలి దుమారంతో భారీ వర్షం రావడంతో వరద వచ్చి సంచులలో మరియు కుప్పలు పోసిన వడ్లు తడిసిపోయిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురైనారు .నెల రోజుల కిందనే కోతలు పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం మూలంగా వడ్లు తడుస్తున్నాయని రైతుల పేర్కొన్నారు

ప్రతి సంవత్సరం యాసంగి పంట సమయంలో ఇలాంటి ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నామని పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న వడ్లు కొనుగోలు సకాలంలో జరగకపోవడంతోనే రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు
నిర్మల్ జిల్లాలో రైతులు తడిసిన వడ్లు కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేశారు అధికారులు వచ్చి తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సైతం ఇదే సమస్య తో రైతులు ధర్నా చేపట్టారు

అధికారుల అలసత్వంతోనే కొనుగోలులో జాప్యం..15 రోజులు గడిచిన కొనుగోల్ చేయలేదని తడిసిన వరి ధాన్యం బస్తాలతో రోడ్డెక్కిన రైతులు…తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు
నిర్మల్ జిల్లా,ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని PACS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది…..తడిసిన వరి ధాన్యం బస్తాలతో పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రైతుల ధర్నా నిర్వహించారు..

అధికారుల అలసత్వంతోనే వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని pacs అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు..జిల్లా కలెక్టర్ వచ్చేన్తా వరకు రోడ్డు పై నుండి లేసేది లేదని రైతులు బైఠాయించారు . ధర్నా చేపట్టారు..దీంతో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి… తడిసిన ధాన్యాన్ని కొనుగులు చేయాలని రైతుల డిమాండ్ తో pacs EO ధర్నా చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని రైతులకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు… ఈ ధర్నాకు ప్రతిపక్షాలు నాయకులు మద్దతు తెలిపారు..

Latest News