టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు ఇటీవల తెగ వినిపిస్తుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు క్రిష్‌కి సంబంధించి రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24వ తేదీన డ్రగ్స్ పార్టీ వెలుగులోకి రాగా, ఆ సమయంలో క్రిష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పుడు తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమేనని చెప్పారు. అయితే శుక్రవారం క్రిష్‌ను కొద్ది సేపు విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయన నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.
క్రిష్ పేరు గత కొద్ది రోజులుగా వార్తలలో నిలవడంతో ఆయనకి సంబంధించి అనేక వార్తలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. క్రిష్ పెళైన రెండేళ్లకే తన భార్య నుండి ఎందుకు విడిపోయాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2016లో రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్న క్రిష్ 2018లో ఆమెతో విడిపోయాడు. అయితే క్రిష్ విడిపోవడానికి అప్పుడు ఓ హీరోయిన్ కారణం అంటూ ప్రచారం జరిగింది. కంచె సినిమా తర్వాత క్రిష్ ఆ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని, అయితే పెళ్లైన తర్వాత కూడా ఆమెతో రిలేషన్ షిప్ కొనసాగించడంతో రమ్య అతనికి డివర్స్ ఇచ్చిందని టాక్. మరి దీనిపై అయితే ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ లేదు కాని మేటర్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అయింది.
వైవిధ్యమైన చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా క్రిష్ నిలిచాడు. అతను తీసిన ప్రతి చిత్రం కూడా కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలు క్రిష్‌కి మంచి పేరు తీసుకువచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు టీజర్స్ విడుదల కాగా, ఇవి అభిమానులకి తెగ నచ్చేశాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.