Zodiac Signs | 100 ఏళ్ల త‌ర్వాత ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు.. ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ఖాయం..!

Zodiac Signs | ఇది అరుదైన స‌న్నివేశం. 100 ఏళ్ల త‌ర్వాత‌ ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు( Raja Yogam ) ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ( Childrens Birth ) ఖాయం. మ‌రి మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కారం.. గ్ర‌హాలు ఒక రాశి నుంచి మ‌రో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా గ్ర‌హాలు త‌మ రాశుల‌ను మార్చుకున్న‌ప్పుడ‌ల్లా.. అరుదైన రాజ‌యోగాలు( Raja Yogam ) ఏర్ప‌డుతాయి. ఈ రాజ‌యోగాలు ఆయా రాశుల‌కు( Zodiac Signs ) సంప‌ద‌ను తెచ్చిపెడుతాయి. క‌ష్టాల‌ను పార‌దోలుతాయి. అయితే మకర రాశి( Capricorn ) లో మూడు రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశులకు అదృష్టం వ‌రించ‌నుంది. మకరరాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం( Budhaditya raja yoga ), బుధుడు, కుజుడు కలిసి ఉండటం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం( Lakshmi Narayan Raja Yoga ) ఏర్పడుతోంది. మకరరాశిలో కుజుడు సంచారం వల్ల రుచక రాజయోగం( Ruchak Rajyog ) కూడా ఏర్పడింది. దీంతో ఈ మూడు రాశుల‌కు శుభాలు క‌ల‌గ‌నున్నాయి. ఏన్నో ఏండ్ల నుంచి సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి త‌ప్ప‌కుండా పిల్ల‌లు( Childrens ) పుట్ట‌నున్నార‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఇంత‌కీ ఆ రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

మకర రాశి ( Capricorn )

మకరరాశిలో ఏర్పడిన ఈ మూడు రాజయోగాలు ఈ రాశివారికి చాలా సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాబోయే కొన్ని నెలలపాటు శుభకార్యాలు జరుగుతాయి. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు నగలు, ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. అవివాహితులకు త్వరలో మంచి సంబంధం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు కొద్ది రోజుల్లోనే శుభవార్త వింటారు. లక్ష్మీనారాయణ యోగం కారణంగా మకరరాశివారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

వృషభం  (Taurus)

వృషభ రాశి 9వ ఇంట్లో ఈ మూడు రాజయోగాలు ఏర్పడతాయి. దీంతో పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్లుగా వృషభ రాశి వారి జీవితం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కెరీర్‌లో ఊహించని పురోగతిని పొందుతారు. మీరు ఉమ్మడి వ్యాపారంలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు తొలగిపోతాయి. మీరు పనిచేసే చోట సానుకూల ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

మీన రాశి  (Pisces)

ఈ రాశిలో 11వ ఇంట్లో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా మీరు చేపట్టిన ప్రతీ పని విజయవంతమవుతుంది. మీకు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మీ కెరీర్‌లో పురోగతి చూస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల నుంచి సమస్యలు తొలగిపోతాయి. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. నూతన వధూవరులకు సంతానం గురించి శుభవార్త వింటారు. బంధువులు మీ ఇంటికి వస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.

Latest News