హైదరాబాద్ : బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
గోపీనాథ్, శ్రీధర్ రెడ్డి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ గోపీనాథ్.. శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి పిచ్చి నా కొడుకు అని పరుష పదజాలంతో దూషించారు. శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ.. ఏం మాట్లాడుతున్నావ్ అని గోపీనాథ్‌ను ప్రశ్నించారు. స్టేజీపైనే ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరువురిని సముదాయించారు. అంతలోనే వారి మద్దతుదారులు గోల చేశారు. మళ్లీ గోపీనాథ్ కల్పించుకొని నువ్వు జరుగు బై అంటూ ఎదురించారు. నిన్ను ఎవరు పిలిచారంటే.. నిన్ను ఎవరు పిలిచారంటూ ఇద్దరు వాదులాడుకున్నారు. తన్నులు తింటవ్ అని మాగంటి.. శ్రీధర్ రెడ్డిని బెదిరించారు. ఇంతలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలుగజేసుకొని.. కుర్చీల విషయం చిన్నదే కూర్చోండి బాస్ అంటూ కార్యకర్తలను సముదాయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసాభాస
స్టేజి పైనే తిట్టుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధర్ రెడ్డి. pic.twitter.com/EN6dCTtRvI
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024