Miss World Kristina Pizkova: ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) క్రిస్టినా పిజ్కోవా హైదరాబాద్ లో సందడి చేసింది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఫ్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యరు. తెలుగు భాషలో నమస్తే ఇండియా అంటూ ఆమె తన ప్రసంగం మొదలుపెట్టిన అందరిని ఆకట్టుకుంది. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని..ఇండియాలో ఒక స్పిరిట్ ఉందన్నారు. వివిధ మతాల వారు కలిసి జీవిస్తున్న గొప్ప దేశమని..ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం అలాగే రాష్ట్ర ఆదాయం పెంచడానికి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 140దేశాల నుంచి ప్రతినిధులు, మీడియా వారు వస్తారని. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని..పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. ప్రపంచం దృష్టి మన రాష్ట్రంపై పడుతుందని..అందాల పోటీలు అంటే ఇంకో కోణంలో చూడొద్దని..ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు, మనోధైర్యం, సంకల్పం ఇస్తుందని చెప్పారు.
స్మితా సబర్వాల్ మాట్లాడుతూ 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సిద్ధమైందన్నారు. ఈవెంట్ రాకతో హైదరాబాద్ కే అందం వచ్చిందన్నారు. తెలంగాణను త్రిలింగ దేశం అంటారని, తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ అని, మిస్ వరల్డ్ పోటీల ప్రీ ఈవెంట్ లో తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ కూడా హాజరయ్యారు.