Muthyampeṭa | ముత్యంపేట.. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి

Muthyampeṭa | ఈ మాత్రం పోరాటం చేయ‌క‌పోతే లోప‌క తిని క‌డుక్కు తాగేవారు: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం చెక్కర కంపెనీలు మూత‌పెట్టిన పార్టీకి ఓటు వేయెద్దు: ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి వ్య‌వ‌సాయ‌రంగాన్ని ఐసీయూలు పెట్టి రైతు బంధు అనే ఆక్సీజ‌న్ ఇస్తున్నారు అభివృద్ధి అంటే కేవ‌లం హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు, ప్ర‌తిగ్రామం, ప్ర‌తి జిల్లా అభివృద్ధి చెందాలి: ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌ హైద‌రాబాద్, విధాత‌: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ […]

  • Publish Date - August 22, 2023 / 01:41 AM IST

Muthyampeṭa |

  • ఈ మాత్రం పోరాటం చేయ‌క‌పోతే లోప‌క తిని క‌డుక్కు తాగేవారు: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం
  • చెక్కర కంపెనీలు మూత‌పెట్టిన పార్టీకి ఓటు వేయెద్దు: ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి
  • వ్య‌వ‌సాయ‌రంగాన్ని ఐసీయూలు పెట్టి రైతు బంధు అనే ఆక్సీజ‌న్ ఇస్తున్నారు
  • అభివృద్ధి అంటే కేవ‌లం హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు, ప్ర‌తిగ్రామం, ప్ర‌తి జిల్లా అభివృద్ధి చెందాలి: ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌

హైద‌రాబాద్, విధాత‌: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పున‌రుద్ధ‌ర‌ణ క‌మిటీ స‌భ్యులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, ప్రొ. కోదండ‌ రాం, ప్రొ. హ‌ర‌గోపాల్‌, పాశం యాద‌గిరి, ప్రొ. దొంతు న‌ర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ ని మూపించిన పార్టీకి ఓటు వేయొద్ద‌న్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో TRS పార్టీ 2014 లో అధికారంలోకి రాగానే 100 రోజుల్లో స్వాధీనం చేసుకొని ఫ్యాక్టరీని తెరిపించి, పూర్వవైభవాన్ని తెస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. 10 సంవత్సరాల్లో రెండు సార్లు స్థానిక MLA తో పాటు BRS పార్టీ ఎ ఒక్క చిన్న ప్రయత్నం చేయలేదని తెలిపారు. లక్షల టన్నుల చెరకు క్రషింగ్ సామర్ధ్యం ఉన్న ఫ్యాక్టరీని పునరుద్ధరించకపోగా కుంటి సాకులతో కాలయాపన చేసిన BRS పార్టీకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని వెల్లడైందన్నారు.

ప్రొఫెస‌ర్ కోదండ రాం మాట్లాడుతూ నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ అమ్మ‌కానికి పెట్టిన‌ప్పుడే వ్య‌తిరేకంగా తీవ్ర‌మైన నిర‌స‌న వ్య‌క్తం చేశామ‌న్నారు. బీఆరెస్ వ‌చ్చినాక ప్రైవేటు రంగంలో కూడా న‌డ‌వ‌నీయ‌కుడా మూత‌ ప‌డేసింద‌న్నారు. లాభాలు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వానికి తెలుసున్నారు. అయినా కూడా ప్ర‌భుత్వ ప‌రం చేయ‌కుండా వారి స్వ‌లాభం కోసం కంపెనీల భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామ‌నుకుంటు న్నార‌న్నారు. ఇంత కొట్లాడాతున్నాము కాబట్టి దాన్ని అమ్మకుండా వదిలిపెట్టిండ్రు లేకపోతే ఈపాటికి కడుక్కో తాగుదురు, లోపుకొని తిందురు అంటారు కదా అట్లా తాగి మొత్తం ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు చేసి అమ్ముకుందరన్నారు.

ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. అభివృద్ధి అంటే కేవ‌లం హైద‌రాబాద్ ఒక్క‌టే అభివృద్ధి చెండం కాదు. ప్ర‌తి గ్రామం, ప్ర‌తి జిల్లా అభివృద్ధి చెందాల‌న్నారు. హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌లు పెంచి, ఐటీ కంపెనీలు పెడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన‌ట్లైతే.. గ్రామీణ ప్రాంతాల ప‌ని ఏంట‌న్నారు.

బీఆరెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగాన్ని ఐసీయూలో ప‌డేసి రైతుబంధు అనే ఆక్సీజ‌న్ అందిస్తుంద‌న్నా రు. తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో సీఎం కేసీఆర్‌ని ఒక్క సారి కూడా క‌ల‌వ‌లేద‌న్నారు. క‌ల‌వ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఇప్పుడు భావిస్తున్నాన‌న్నారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక రెండు సార్లు క‌లిశాన‌న్నారు. అప్ప‌డు హైద‌రాబాద్‌కు సంబంధించి భూముల విష‌యంపై ఓ క‌మిటీ వేయ‌లాని చెప్పాన‌న్నారు. అయితే ఆ ప‌ని చేయ‌క‌పోగా ప్ర‌భుత్వ భూముల‌న్ని ప్ర‌యివేట్ వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్లాయ‌న్నారు.

Latest News