Site icon vidhaatha

ఇయ‌ర్ ఎండింగ్‌లో ఓటీటీలో హంగామా.. ఈ వారం ఏమేం సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయంటే..!

ఈ ఏడాది చివ‌రి వారం. ప్రేక్ష‌కుల‌కి కొత్త వినోదాన్ని పంచేందుకు ఓటీటీ సంస్థ‌లు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నాయి. డిసెంబర్ చివరి వారం 2023 కి వీడ్కోలు చెబుతూ ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరిసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి .. డిసెంబర్ 26-31 మధ్య స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో ‘మంగళవారం’, ‘కీడా కోలా’ ఇటీవలి రెండు తెలుగు హిట్ సినిమాలు, సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘టైగర్ 3’ పై అంచ‌నాలు ఉన్నాయి. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో చూస్తే… మంగళవారం- డిసెంబర్ 26 (డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్) అవుతుండ‌గా, 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేషియన్ చిత్రం)- డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టైగర్ 3 (హిందీ మూవీ)- డిసెంబర్ 31నుండి స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- డిసెంబర్ 25,స్నాగ్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 25,కో గయే హమ్ కహా (హిందీ చిత్రం)- డిసెంబర్ 26,థ్యాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ చిత్రం)- డిసెంబర్ 26,హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 27,ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ సినిమా)- డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక మిస్ శాంపో (మాండరిన్ చిత్రం)- డిసెంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 28,పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 28 నుండి ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచ‌నుంది.ఇక అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిసెంబర్ 29, శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ చిత్రం)- డిసెంబర్ 29, త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా)- డిసెంబర్ 29, బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ చిత్రం)- డిసెంబర్ 29,బెర్లిన్ (స్పానిష్ సిరీస్)- డిసెంబర్ 29, డేంజరస్ గేమ్: ది లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 31, ది అబాండడ్ (మాండరిన్ మూవీ)- డిసెంబర్ 31 నుండి స్ట్రీమ్ కానుంది.

జీ5లో చూస్తే.. దోనో (హిందీ చిత్రం)- డిసెంబర్ 29 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ చిత్రం)- డిసెంబర్ 29, సఫేద్ (హిందీ మూవీ)- డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, జియో సినిమాలో ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 25 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఎవ్రీబడీ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 30 నుండి స్ట్రీమ్ కానుంది. బుక్ మై షోలో ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, లయన్స్ గేట్ ప్లేలో ది కర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- డిసెంబర్ 29 నుండి స్ట్రీమ్ కానుంది. శుక్రవారం రోజున అంటే డిసెంబర్ 29న 11 సినిమాలు రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

Exit mobile version