టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.గీతా గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ అనే చిత్రాలలోఈ ఇద్దరు కలిసి నటించగా, ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టిందని ప్రస్తుతం సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నారని కొన్ని రోజులుగా అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక మాత్రం మౌనంగానే ఉంటున్నరు. తమపై వచ్చిన వార్తలకి ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే ఇప్పటికే ఈ జంట పలుమార్లు వీరు ముంబైలో చక్కర్లు కొడుతూ కెమెరాకు దొరికారు.
రెండు సార్లు మాల్దీవ్స్ కి వెళ్లారు. ఓసారి మాల్దీవులకి విజయ్‌తో ఎందుకు వెళ్లారు అని అడిగితే… స్నేహితుడితో వెకేషన్ కి వెళితే తప్పేంటని రష్మిక తిరిగి ప్రశ్నించింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా రష్మిక జాయిన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక హైదరాబాద్ వచ్చినప్పడు రష్మిక తప్పకుండా విజయ్ ఇంట్లో దిగుతుంది. అంతేకాదు పలు సందర్భాలలో ఆయన ఇంట్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరరకొండ బేబీ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఆ సమయంలో విజయ్ ఇంట్లోనే రష్మిక దిగినట్టు ప్రచారం జరిగింది.
ఇక రష్మిక తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసి విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమలో మునిగి తేలుతున్నారనడానికి సాక్ష్యం ఇదేనంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైన వీరు మాత్రం రోజురోజుకి అభిమానులకి మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ తెగ టెన్షన్‌కి గురి చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నారు. దర్శకుడు పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంఇ . ఇక రష్మిక యానిమల్, పుష్ప 2, రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుండగా, ఈ అమ్మడికి ఈ చిత్ర విజయాలు తప్పనిసరి కావలసి ఉంది. కొద్ది రోజులుగా రష్మికకి సరైన హిట్స్ లేవు.