Site icon vidhaatha

Natu Natu Win Oscar | విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా.. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డు

Natu Natu Win Oscar | విశ్వ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. తెలుగు సినిమా చరిత్ర ఎల్లలు దాటింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ అవార్డును గెలుపొందింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్‌ నామినేట్‌ అయ్యింది.

ఈ పాటతో పాటు మ‌రో నాలుగు సినిమాల‌ పాట‌లు పోటీ ప‌డ్డాయి. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి విభాగంలో మొత్తం 81 పాటలు పోటీ ప‌డ‌గా, 15 పాట‌ల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో నుంచి ఐదు పాట‌లు నామినేట్ కాగా, నాటు నాటు పాట ఆ ఐదింటిలో చోటు ద‌క్కించుకుంది.

ఆస్కార్స్: నాడు శిష్యుడు రెహమాన్.. ఇప్పుడు గురువు కీరవాణి..!

Exit mobile version